తల్లిదండ్రులను పూజించే చోట లక్ష్మీదేవి ఉంటుందట!

కన్న తల్లిదండ్రులను పూజించేచోట, మంచి ముత్యాలున్నచోట, తెల్లని వస్త్రాలతో పరిశుభ్రంగా మనుషులు తిరిగే ప్రదేశాల్లో, పాత్రల నిండా నీరు- పాలు ఉన్నచోట, వెండి వస్తువులు, చందనం, వెండి గిన్నెలో పాలు, పెరుగు, మజ్జిగలు ఉన్న ఇంట్లో లక్ష్మి నివసిస్తుంది. ఎక్కడైతే భక్తి ఉంటుందో, ఎక్కడైతే పసుపుపచ్చని పూలు ఉంటాయో, పెద్దలు, గురువులు ఎక్కడయితే పూజలందుకుంటారో అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం చేస్తుంది.

నలుగు పిండితో స్నానం చేసే స్త్రీలున్న ఇల్లు, వడపప్పు ప్రసాదంగా పెట్టే ప్రదేశం, శాంత స్వరూపులు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే ప్రదేశాలు, బద్ధకం, అశ్లీలత, హింసా ప్రవృత్తులు లేనిచోట ఆమెకు ప్రియప్రదేశాలు. సూర్యుడు ఉదయించే సమయాన్ని చూసేవారికి ఈమె కటాక్షం తప్పక ఉంటుంది. సూర్యుడు అస్తమించే సమయంలో నిద్రించేవారు అమ్మకు నచ్చరు. అంటే పరిశుభ్రంగా, పరిశుద్ధ సేవా గుణం నిండిన హృదయాలతో ఉండేవారింట లక్ష్మీదేవి కలకలం నివసిస్తుందని పండితులు అంటున్నారు.

No comments:

Post a Comment